VSP: APSRTC రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు మధురవాడ డిపోను మంగళవారం తనిఖీ చేశారు. శక్తి, దివ్యాంగ శక్తి పథకాల తర్వాత ప్రయాణికులు పెరిగినందున ప్రతి స్టేజీలో బస్సులు ఆపి ఎక్కించాలన్నారు. నిర్లక్ష్యం లేకుండా డ్రైవింగ్ చేసి సేవాభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. బస్ స్టేషన్లో పరిశుభ్రత, బెంచీలు, ఫ్యాన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.