SRPT: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్భంగా హుజూర్ నగర్లో పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టారని, ప్రజా వ్యతిరేక శక్తులకు ఈ తీర్పు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.