TG: యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రగతి పథంపై పరుగులు పెడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తుండటంతో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలకాలని కోరారు. మమతా బెనర్జీ ప్రజల తీర్పుని అంగీకరించాలి కానీ.. ప్రజలను అవమానపరిచే మాటలు మాట్లాడడం మంచిది కాదని సూచించారు.