PPM: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి.రవి కుటుంబానికి ఇవాళ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి GPAI ద్వారా మంజూరైన రూ.20.65 లక్షలను అందజేశారు. అనంతరం కానిస్టేబుల్ సతీమణి లలితకు ధైర్యం చెప్పారు. పిల్లల భవిష్యత్‌కు ఈ నగదును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.