ATP: రాయదుర్గం పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపాన ఉన్న హనుమంతప్ప కుంట వద్ద కాలిపోయి పడి ఉన్న గుర్తు తెలియని మహిళా శవం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొందరు మహిళా మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
KRNL: ఆదోనిలో ఆదివారం రాత్రి డోక్రా గృహాల పక్కన భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా చెలరేగాయి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: భార్యా భర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు దాడికి దారి చేశాయి. ఈ ఘటన నవీపేటలో చోటుచేసుకుంది. అభంగపట్నంకు చెందిన జ్యోతికి మిథున్‌తో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా మూడు నెలల నుంచి తల్లి గారి ఇంట్లో ఉంటుంది. దీంతో తన భర్త కక్ష పెంచుకొని, శనివారం జ్యోతి తండ్రిపై బండరాయితో దాడి చేశాడు. అలాగే జ్యోతి తోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.బస్సు కంటైనర్ 2 కార్లు ఢీకొనడంతో ఓకారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి HYDవెళ్తున్న బస్సుడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారు బస్సు కిందికి దూసుకుపోయింది. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
RR: యాచారం మండల పరిధిలోని గాండ్లగూడెంలో పురుగు మందు తాగి ఆర్టీసీ కండక్టర్ అంజయ్య(40) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం పురుగుల మందు తాగడంతో స్థానికులు అతడిని నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. పై అధికారుల ఒత్తిడే కారణమని ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ELR: మండవల్లి రైల్వేస్టేషన్ పరిధిలో ఓ యువకుడు గురువారం రాత్రి ట్రైన్ కింద పడి మృతి చెందాడు. పేరి రాము, వీరకుమారి పెద్ద కుమారుడు ఆంజనేయులు(19) ఐటీఐ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కొండ్రాయి చెరువు ఎదురుగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శంభులింగేశ్వర ఆలయ వెనుక మహిళ మృతదేహాం లభ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మండలంలోని నందికంది గ్రామానికి చెందిన సారలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి తలకు గాయం ఉండడంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
NZB: కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం (60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు
ATP: గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద బుధవారం ముందుగా వెళుతున్న లారీని మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మెయిన్ సర్కిల్లో లారీ నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
NLG: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతిచెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్ పేటకు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్స్యగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
SRPT: చిలుకూరు మండలం సీతారామపురం స్టేజి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో లారీలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: కంచనపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఆదివారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: హొళగుంది (మం) ఎల్లార్తి గ్రామంలో బోయ కామాక్షమ్మ అనే మహిళకు చెందిన బీడీ బంకు విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్‌తో కాలిపోయింది. ప్రమాదంలో దాదాపు రూ.50 వేలు విలువజేసే సరకులు కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. బంకులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో స్థానికులు మంటలు ఆర్పే లోపు అప్పటికే చాలా వరకు సరకులు కాలిపోయాయని తెలిపారు.
TPT: నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ (42) పుదూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ బాబి వివరాలు మేరకు.. భాస్కర్ విధులు నిర్వహించుకొని తన సొంతూరు ఈశ్వరవాక వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
ప్రకాశం: మానవ సంబంధాలను మంట గలిపే దారుణ ఘటన కొండపి మండలంలో వెలుగు చూసింది. విజయవాడలోని తల్లి వద్ద ఉంటున్న పెద్ద చెల్లిని, సొంత అన్న గతేడాది క్రిస్మస్కు పెట్లూరుకు తీసుకొచ్చాడు. పండగ అనంతరం చెల్లిని విజయవాడలో వదిలిపెట్టకుండా తన వెంట హైదరాబాద్ తీసుకువెళ్లాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో తల్లి వద్దకు చేరుకున్న కుమార్తెకు వైద్య పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది.