• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

టీడీపీ అధ్యక్షుడి కారుకు నిప్పు

AP: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయగౌడ్‌ కారుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఉదయానికి కారు పూర్తిగా దగ్ధమైంది. దీనిపై విజయగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనక రాజకీయ కుట్ర ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

March 11, 2025 / 11:25 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

KRNL:  జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదోని మండల పరిధిలోని పాండవగల్లు గ్రామ సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు, బైక్‌లను ఢీకొంది. స్థానికుల వివరాల మేరకు.. గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూరు వెళ్తూ.. ముందు వెళ్తున్న రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.

March 11, 2025 / 11:23 AM IST

‘స్ట్రీట్ లైట్స్‌ను ఢీకొట్టిన కారు’

KNR: గిద్దె పెరుమాండ్ల దేవస్థానం గ్రౌండ్‌లో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో వ్యక్తి కారు నేర్చుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ట్రాక్‌పై ఉన్న స్ట్రీట్ లైట్స్‌, పూలమొక్కలు, కుండీలను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వాకర్లు భయాందోళనకు లోనయ్యారు.

March 9, 2025 / 08:05 PM IST

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ATP: హిందూపురంలోని ఆటోనగర్‌లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్‌‌లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు.

March 9, 2025 / 05:20 PM IST

గుండంలో మునిగి బాలుడి మృతి

MDK: శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గుండంలో పడి బాలుడు మృతి చెందాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వారం వారం జరిగే ఉత్సవాలకు హైదరాబాద్ బాలాజీనగర్‌కు చెందిన కరుణాకర్ (14) కుటుంబం విచ్చేసింది. ఈ క్రమంలో ఆలయం వద్ద గుండంలో స్నానం చేసేందుకు దిగిన కరుణాకర్ మునిగి మృతి చెందాడు. 

March 9, 2025 / 05:18 PM IST

చేపల వేటకు వెళ్లి.. వ్యక్తి మృతి

WNP: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రామన్ పాడు రిజర్వాయర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపూర్ మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన వాకడి గిరి (45) ఆదివారం ఉదయం చేపల వేటకు రిజర్వాయర్‌లోకి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 9, 2025 / 10:16 AM IST

నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

MBNR: ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది.

March 9, 2025 / 09:40 AM IST

పుత్తూరు హైవేపై రోడ్డు ప్రమాదం

CTR: పుత్తూరు మండలం తడుకు సమీపంలో హైవేపై భారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. శనివారం రాత్రి బస్సుని ఓవర్ టేక్ చేయబోయిన లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న హైవే కల్వర్టు గోడని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో లారీ భారీగా దెబ్బతింది. ఎవరికి ప్రాణనష్టం కలగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 9, 2025 / 08:40 AM IST

ఫైనాన్స్ ఉద్యోగిపై వ్యక్తి దాడి

CTR: పుంగనూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పురుషోత్తం ఓ ఫైనాన్స్‌లో పర్సనల్ లోన్ తీసుకున్నాడు. పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లించకపోవడంతో శ్రీరామ ఫైనాన్స్ ఉద్యోగి నందీశ్ గ్రామానికి వెళ్లి డ్యూలు కట్టాలని అడగగా, మాటామాటా పెరిగి పురుషోత్తం వేట కొడవలితో నందీశ్‌పై దాడి చేయడంతో గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేసి కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

March 9, 2025 / 08:01 AM IST

షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధం

WNP: షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అల్వాల గ్రామానికి చెందిన హరికృష్ణకు చెందిన పూరిగుడిసె విద్యుతాఘాతం వల్ల పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రూ.2 లక్షల నగదు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు వాపోయాడు.

March 9, 2025 / 05:25 AM IST

వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిన అక్క హత్య!

HYD: వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని సొంత అక్కని ప్రియుడి సహాయంతో చెల్లి హతమార్చింది. రైల్వే ఉద్యోగి లక్ష్మీకి అరవింద్‌తో వివాహేతర సంబంధం ఉంది. లక్ష్మీ రైల్వే క్వార్టర్స్‌లో తన అక్క జ్ఞానేశ్వరి (మతిస్థిమితం సరిగా లేదు)తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉందని ఇద్దరు కలిసి జ్ఞానేశ్వరిని హత్య చేసి ఒక గుంతలో వేసి చెత్తాచెదారాన్ని కప్పివేశారు.

March 8, 2025 / 08:00 AM IST

మదర్స్ ఆర్బిక్ పాఠశాలలో పేలిన సిలిండర్

JGL: జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలి పెను ప్రమాదం తప్పింది. మదర్ సా – అరాబిక్ పాఠశాల ముందు ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదం జరిగింది. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో వస్తువులు కాలిపోయి ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.

March 7, 2025 / 06:36 PM IST

ఉపాధి పనిలో వృద్ధురాలికి గాయాలు

ASR: రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామానికి చెందిన ఉపాధి కూలి బి.కొండమ్మ శుక్రవారం ఉదయం గాయపడింది. తంటికొండ గ్రామంలో చెరువు పూడికతీత పని చేస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఆమెకు చేతికి తీవ్రమైన గాయమైంది. ఆమె బంధువులు అందుబాటులో లేకపోవడం ఫీల్డ్ అసిస్టెంట్ మంగారాజు, తోటి కూలీలు రాజవొమ్మంగి ఆసుపత్రి తరలించగా వైద్య సహాయం అందజేశారు.

March 7, 2025 / 10:53 AM IST

గుంటూరులో భారీ చోరీ

GNTR: నగరంలో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విద్యానగర్‌కు చెందిన సత్యన్నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. రూ. 70 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 2లక్షల నగదును దొంగలు చోరీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 7, 2025 / 08:25 AM IST

లోడింగ్ గన్‌తో విమానం ఎక్కిన బాలుడు

ఆస్ట్రేలియాలోని అవలోన్ విమానాశ్రయంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలోని ఓ 17 ఏళ్ల బాలుడు ఎక్కాడు.  విమానంలోకి ఆ బాలుడు లోడింగ్ గన్ తో ఎక్కాడు. అతడు గన్ బయటకు తీయగానే విమానంలోనే ఉన్న మాజీ బాక్సర్ భారీ క్లార్క్ అప్రమత్తమై నిలవరించాడు. మాజీ బాక్సర్ చాకచక్యంతో ముప్పు తప్పింది. విమానాశ్రయం కంచెలో దూరి బాలుడు విమానం ఎక్కడని పోలీసులు తెలిపారు.

March 7, 2025 / 08:19 AM IST