WNP: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ ఫొటోగ్రాఫర్ మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. చందాపూర్‌కి చెందిన అనిల్ కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నారు. నిన్న రాత్రి వనపర్తి నుంచి చందాపూర్ వస్తుండగా మార్గమధ్యలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు.
అనకాపల్లి: బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థిని పట్ల అసంభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఏ. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. చోడవరం కోర్టులో ముద్దాయిని హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
కృష్ణా: గన్నవరం మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వీరపనేనిగూడానికి చెందిన రానిమేకల వీరబాబు(44) మద్యానికి బానిసై, భార్య డబ్బులివ్వలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD: సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు.
RR: మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాటేదాన్ పారిశ్రమికవాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. పట్టణంలోని కిష్టాపూర్ రోడ్డులో ఉన్న జమున వెంచర్లాట్ నెంబరు 33లో ఆర్మూర్ శ్రీనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట కృష్ణవేణి సిమెంట్ వర్క్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. శ్రీనాథ్ వెనుక భాగంలో బలమైన గాయాలు ఉండటంతో సహచర కార్మికుడు రాజును పోలీసులు విచారిస్తున్నారు.
ప్రకాశం: పామూరు మండలంలోని ఊరకొండ వద్ద ఉన్న మట్టి కుప్పల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. అతను సుమారు 2, 3 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి 60 నుంచి 65 సంవత్సరాల వయసు ఉంటుంది. కనిగిరి గవర్నమెంట్ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించామని పోలీసులు తెలిపారు.
అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు వేలూరు ఆసుపత్రిలో శనివారం మృతి చెందాడు. రామసముద్రంలోని కర్నాల వీధికి చెందిన వేణు (25) వారం రోజుల క్రితం తమిళనాడులోని వేలూరులో బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వేణును స్థానిక వేలూరు ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులు మృత్యువతో పోరాడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ADB: కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైన ఘటన శుక్రవారం రాత్రి భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..నిర్మల్ నుంచి వస్తున్న కారును భైంసా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద కారును లారీ ఢీకొంది, కారులో ఉన్న భైంసా పట్టణానికి చెందిన శంకర్‌కు గాయాలు కాగా భైంసా ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
పల్నాడు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వైపు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాజు, హాబీబ్ అనే ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
KMM: కూసుమంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జిల్లా వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. మండల వైద్యాధికారిపై ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత సంవత్సరం పల్స్ పోలియో నిధులు పల్లెదావఖాన నిధుల అక్రమ వినియోగంపై విచారణ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 18 శంకరాచార్య మార్గ్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: మినీలారీని ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి పామూరు మండలంలోని వగ్గంపల్లె గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువకుడు తాటాకులతో వెళ్తున్న రిక్షాను ఓవర్ టేక్ చేయబోయాడు. తాటాకులు తగిలి బైక్ అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని మృతి చెందాడు. మృతుడి వివరాలకోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
BDK: బూర్గంపాడు మండలం గొమ్మూరు ఇసుక ర్యాంపు సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్రలతో వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.