ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంచీ, ఢిల్లీలో స్పెషల్ పోలీస్ సెల్ ఆపరేషన్ చేపట్టి ముంబైకి చెందిన ఆఫ్తాబ్ను అరెస్టు చేసినట్లు సమాచారం. అతని నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: గోకవరంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను బయటకు వెళ్లగానే మరో యువకుడు దారుణానికి ఒడిగడ్డాడు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాధితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు మంగళవారం సాయంత్రం నిరసన చేపట్టారు. పీడీఎస్ఈయూ రాష్ట్ర కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు.
SKLM: ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో రెండు వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ ఘర్షణలో అరసవల్లి హరమ్మ (70) గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై ఇరు వర్గాలకు చెందిన 14 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై బాలరాజు మంగళవారం తెలిపారు.
SKLM: లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో ఓ రైస్ మిల్లు సమీపంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న జూదం శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. తమకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు దాడి చేసినట్లు ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.8,300 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
KDP: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లాలో తనకల్లు మండలంలోని కొక్కంటి సమీపంలో మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కడప జిల్లా కొండప్పగారిపల్లి, బురుజుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యవసాయ కూలీలు మరణించారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. అగ్రహారంపల్లిలో టమాటా తోటలో పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సత్యసాయి: తనకల్లు మండలం అగ్రహారంపల్లిలో పనికి వచ్చిన కూలీలు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. కొక్కంటి సమీపంలో ఆటో బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు కడప జిల్లా చక్రాయపేట మండలంలోని కొండప్పగారిపల్లి, ఆంజనేయపురం, బురుజుపల్లి గ్రామాలకు చెందినవారని స్థానికులు తెలిపారు.
KDP: ఖాజీపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 వాహనంలో చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
CTR: GD నెల్లూరు మండలం అంబోదరపల్లిలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు. ఓ కుటుంబం మరో కుటుంబసభ్యులపై కారం పొడి చల్లి కత్తితో పొడిచి, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRML: ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. బైంసా మండలంలోని కోతుల్ గామ్ గ్రామంలో చిట్యాలవార్ గంగారం(60) అనే వృద్ధుడు బర్రెలు మేపుతూ ఉంటాడు. మంగళవారం గంగారం బర్రెలు మేపుతూ చెరువు దగ్గర వెళ్లగా ప్రమాదవశత్తు చెరువులో పడిపోయాడు. గమనించేసరికి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
KMM: ఎర్రుపాలెం(M) తక్కెళ్లపాడు గ్రామ చెరువు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఏపీలోని కంచికచర్ల(M) గణాత్కూరుకు చెందిన శ్రీనివాస్-రజినీ దంపతులు బైక్పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కోళ్ల దాణా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా: తోట్లవల్లూరు మండలంలో సోమవారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు జరిగింది. రాజకీయ నాయకుల అండతో పేదల బియ్యం ఆక్రమ రవాణా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. టన్నుల కొద్దీ బియ్యం తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, రెవిన్యూ, పోలీస్ శాఖల సహకారంతోనే ఈ వ్యాపారం సాగుతోందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
HYD: చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భవనం పైనుంచి దూకి ఫాతిమా అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఫాతిమా 5వ అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం తిర్లాపురంలో 5 ఎకరాల భూమి వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
VSP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ఎంహెచ్పీ విభాగం వద్ద ఉన్న కోకింగ్ కోల్లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
VSP: సత్యం జంక్షన్ వద్ద రెండు బైక్లు ఢీకొన్నాయి. మంగళవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నేరుగా వెళ్తున్న బైక్ను సిగ్నల్ క్రాస్ చేస్తూ ఇంకో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే స్కూటీ దెబ్బతింది. మరో బైక్ నడిపిన వ్యక్తి సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు.