TG: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను సంపులో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సల్కెలపురం శివారులోని మామిడి తోటలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో గుజరాత్‌కు చెందిన మేఘనా పటేల్ అనే భారతీయ మహిళ ఓ స్టోర్‌లో దారుణ హత్యకు గురయ్యారు. కస్టమర్ తరహాలో మాస్క్, టోపీ ధరించి వచ్చిన ఓ దుండగుడు ఆమెతో కొద్దిసేపు మాట్లాడి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో కన్నుమూశారు. దోపిడీ ఉద్దేశంతోనే ఈ హత్య జరిగినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు.
TG: హైదరాబాద్ అత్తాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఛాతీ నొప్పితో చేరిన శ్రీనివాస్‌రావు అనే వ్యక్తి, యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసిన తర్వాత పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణం సంభవించిందని ఆగ్రహించిన మృతుడి బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసుపై NIA సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో 10 మంది నిందితులపై NIA దాఖలు చేసిన 7,500 పేజీల భారీ ఛార్జ్‌షీట్ నుంచి కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడుల కోసం నిందితుడు ఆన్‌లైన్‌లో నకిలీ ఐడీతో బాంబుల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించాడని, ఓ ప్రైవేట్ వర్సిటీలో తాత్కాలిక ల్యాబ్ కూడా పెట్టినట్లు వెల్లడైంది.
TG: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే పార్టీకి డ్రగ్స్ 3 మార్గాల్లో వచ్చినట్లు గుర్తించారు. పలువురు డ్రగ్స్ సప్లయర్లను అధికారులు గుర్తించారు. అభిషేక్‌సింగ్, రాకేష్‌వర్మను సిట్ విచారించింది. ముంబైకి చెందిన మజార్ నుంచి కొకైన్ కొన్నట్లు రాకేష్ తెలిపాడు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన ముగ్గురు బెయిల్‌పై విడుదలయ్యారు.
AP: అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: పులాంగ్ కల్లుబట్టిలో సోమవారం జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల వివరాల ప్రకారం.. కల్లు కాంపౌండ్‌లో పులాంగ్‌కు చెందిన షాకీర్, ఇంద్రాపూర్‌కు చెందిన శివలపై మరో ముగ్గురు దాడి చేశారు. ఈ దాడిలో షాకీర్ అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మరో వ్యక్తి శివను 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. మృతుడు తెలంగాణలోన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్(35)గా గుర్తించారు. ప్రమాదంలో లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ అండ్ టీ కార్యాలయంలో మంటలు ఎగసిపడుతున్నాయి. మహాదేవపూర్ మండలం అంబటిపల్లిలో ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కార్యాలయం దగ్గర పంటవ్యర్థాలకు రైతులు నిప్పుపెట్టగా ఎల్ అండ్ టీ కార్యాలయానికి మంటలు వ్యాపించాయి.
TG: మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జాహీద్‌ఖాన్ అనే వ్యక్తి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాద గ్రూప్‌లో చేరేందుకు జాహీద్‌ఖాన్ ప్రయత్నించాడు. హోటల్‌లో పనిచేస్తున్న జాహీద్‌ఖాన్ యూపీకి చెందినవాడని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదులతో టచ్‌లోకి వెళ్లాడు.
TG: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో విక్రమ్ (27), అనిల్ (30) మృతి చెందారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ATP: రాప్తాడు వై జంక్షన్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న ఒక కేజీ గంజాయి, 2 గ్రాముల డ్రగ్, 20 గ్రాముల హైడ్రో గంజాయిని రాప్తాడు సీఐ వెంకటేశులు సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు ఉపయోగించిన కారును జప్తు చేసి, అమీర్ భాష, పెద్ద భాస్కర్ పవన్, బోనాసి శ్రీహరిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ATP: అనంతపురం వన్ టౌన్ పరిధిలోని శారద నగర్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ పి.జగదీశ్ ఆదేశాలతో వన్ టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు శనివారం రాత్రి మెరుపు దాడి నిర్వహించారు. నిందితులు నరవుల రామమోహన్, షేక్ నూర్ మహమ్మద్ నుంచి రూ. 2 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
NLR: చేజర్ల మండలం ఏటూరు సమీపంలో శనివారం ప్రమాదం జరిగింది. పొదలకూరు నుంచి ఏటూరు వెళ్తున్న స్కూటీని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న రమేశ్ (35), పెంచల స్వామి(41) తీవ్రంగా గాయపడ్డారు. రమేశ్ చేయి విరగగా, పెంచలస్వామికి కాలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వారిని 108లో పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
AP: అనకాపల్లి పాయకరావుపేట మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. సత్యవరంలో కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు తమలపాకు సేకరణ కూలీలు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.