MNCL: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య SI సురేశ్ వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన లావణ్య మంగళవారం పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆమెను చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం HYDకి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కాగా ఆమె భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారని తండ్రి ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.
KKD: తాళ్లరేవు మండలం సీతారామపురంలో కోరంగి పోలీసులు ఐదు కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? తదితర వివరాలు సేకరించిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
NLR: మనుబోలు మండల పరిధి అప్పయ్యగేటు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డైవర్‌తో సహా పలువురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
NZB: నగరంలో మంగళవారం కత్తిపోట్ల కలకలం చెలరేగింది. నగరంలోని గాజుల్ పేట్లో ఓ సంఘం సమావేశంలో జరిగిన పరస్పర వాదనలు కాస్తా కత్తిపోట్లకు దారితీసాయి. సంతోష్ అనే వ్యక్తిని ఒకరు కత్తితో పొడిచి గాయపరిచాడు. కత్తిపోట్లలో గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: టిప్పర్‌ను ఓ ట్రావెల్ బస్సు ఢీకొట్టిన సంఘటన వెంకటాచలం మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వారికి ఏం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
SRPT: జిల్లా కేంద్రంలోని 19 వ వార్డు విజయ కాలనీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర జాతీయ రహదారి 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం పల్లె వెలుగు బస్సు, రోడ్డు రోలర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: నగరంలోని గరుడ వారిది ఫ్లైఓవర్ పై మంగళవారం తెల్లవారుజామున బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రుయా ఆసుపత్రికి తరలించారు.
SRD: వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు మంజీరా నదిలో దూకి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగల్గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన సునీల్ చౌహన్(22) గత నెల 28న హైదరాబాద్ నుంచి పల్సర్ బండిపై ఇంటికి బయలుదేరాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. యువకుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ASF: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన పెంచికల్పేట్ మండలంలోని లోడ్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్ల లలితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఆమె భర్త గణేశ్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: రాయదుర్గం పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపాన ఉన్న హనుమంతప్ప కుంట వద్ద కాలిపోయి పడి ఉన్న గుర్తు తెలియని మహిళా శవం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొందరు మహిళా మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
KRNL: ఆదోనిలో ఆదివారం రాత్రి డోక్రా గృహాల పక్కన భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా చెలరేగాయి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: భార్యా భర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు దాడికి దారి చేశాయి. ఈ ఘటన నవీపేటలో చోటుచేసుకుంది. అభంగపట్నంకు చెందిన జ్యోతికి మిథున్‌తో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా మూడు నెలల నుంచి తల్లి గారి ఇంట్లో ఉంటుంది. దీంతో తన భర్త కక్ష పెంచుకొని, శనివారం జ్యోతి తండ్రిపై బండరాయితో దాడి చేశాడు. అలాగే జ్యోతి తోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.బస్సు కంటైనర్ 2 కార్లు ఢీకొనడంతో ఓకారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి HYDవెళ్తున్న బస్సుడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారు బస్సు కిందికి దూసుకుపోయింది. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
RR: యాచారం మండల పరిధిలోని గాండ్లగూడెంలో పురుగు మందు తాగి ఆర్టీసీ కండక్టర్ అంజయ్య(40) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం పురుగుల మందు తాగడంతో స్థానికులు అతడిని నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. పై అధికారుల ఒత్తిడే కారణమని ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ELR: మండవల్లి రైల్వేస్టేషన్ పరిధిలో ఓ యువకుడు గురువారం రాత్రి ట్రైన్ కింద పడి మృతి చెందాడు. పేరి రాము, వీరకుమారి పెద్ద కుమారుడు ఆంజనేయులు(19) ఐటీఐ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కొండ్రాయి చెరువు ఎదురుగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.