NLR: నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య ఘటన కలకలం రేపుతోంది. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చివేసిన శవం లభ్యమయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: సైబర్ నేరగాళ్లు సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులనూ వదలట్లేదు. తాజాగా పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజు బ్యాంక్ ఖాతాపై సైబర్ అటాక్ జరిగింది. RTA ఛలానా పేరుతో బాలరాజు ఫోన్‌కు ఓ లింక్ రాగా.. దాన్ని ఓపెన్ చేయగానే ఆయన అకౌంట్ నుంచి రూ.12 లక్షలు కట్ అయ్యాయి. సైబర్ అటాక్ అని గుర్తించిన MLA వెంటనే జీలుగుమిల్లి(ఏలూరు జిల్లా) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
AP: చిత్తూరులో అక్రమంగా పొగాకు ఉత్పత్తులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. సిద్ధార్థనగర్ కాలనీలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు స్మగ్లింగ్ ముఠా కంటపడింది. దీంతో ముఠా 2 కార్లలో పొగాకు ఉత్పత్తులతో పరారవగా.. పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. నిందితులు నిమిచంద్, సునీల్, శ్రీనివాసులును అరెస్ట్ చేసి, వారి నుంచి 45 బస్తాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
NLR: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి ఒంగోలు నుంచి భీమవరానికి బైక్‌పై వస్తున్న ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు పాలేరు బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు గుర్తించి అంబులెన్స్‌లో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
AP: తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు నియంత్రణ కోల్పోయి హైవే డివైడర్‌ను దాటి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: విజయవాడ నగర శివారు యనమలకుదురు శివాలయంలో అధికారులే చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. అర్చకుడు సాగర్ ఆలయానికి మారు తాళాలు చేయించి ఎవరూ లేనప్పుడు హుండీ కానుకలను మాయం చేసేవాడని తేలింది. ఆలయ మంటపంలోని 16 CC కెమెరాలను ఆఫ్ చేసేవాడని, గత రెండేళ్లలో దాదాపు రూ.10 లక్షల విలువైన కానుకలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. దీనికి ఆలయ ఈఓ భవాని సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.
AP: తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా హైవే డివైడర్‌ను దాటి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన పరుచూరి కృష్ణయ్య 60 శనివారం చిర్లవారికండ్రిక సమీపంలో కళ్లు గీయడానికి వెళ్లాడు. అక్కడ చెట్టు కింద కూర్చున్న సమయంలో రక్తపింజరి పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు అతన్ని పొదలకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య మృతి చెందాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో దానబోయిన చిన్నబుల్లి(68) అనే వృద్ధురాలు మృతిచెందింది. పెద్దిపాలెం గ్రామ శివారులో ఉంటున్న ఆమె.. గేదెలకు నీరు పెట్టేందుకు వెళ్లగా, కోతులు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే వీలు లేకపోవడంతో ఆమె చనిపోయింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని గ్రామస్థులు పేర్కొన్నారు.
AP: విదేశాలకు ఎగుమతి చేసేందుకు అక్రమంగా తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల PDS బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు 5 లారీల్లో తరలిస్తుండగా.. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ బృందం దాడులు చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.65 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనువరాలు దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. తన అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు. ఈ నెల 13న ఆమె పేరు, ఫొటోతో ఉన్న వాట్సాప్ నుంచి అకౌంటెంట్‌కు మెసేజ్ వచ్చింది. ‘నేను మీటింగ్‌లో ఉన్నాను. ఒక అకౌంట్‌కు రూ.1.20 కోట్లు పంపిచాలి’ అని ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో అకౌంటెంట్ ఆ డబ్బు పంపిచాడు.
KNR: జిల్లాలోని శంకరపట్నం మండలం కేశవపట్నం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన గుడిసెల్లో ఉంటున్న ఓ చిన్నారిని లారీ ఢీకొంది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక రోడ్డు పక్కన ఆడుకుంటుండగా లారీ వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: కృష్ణా జిల్లా గన్నవరంలో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపింది. బెట్టింగ్ కారణంగా నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓడిపోయిన వ్యక్తి నుంచి నాగరాజు డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలో పోలీసుల సమక్షంలో పంచాయితీ చేశారు. డబ్బులు తిరిగి చెల్లించాలని నాగరాజును పోలీసులు ఆదేశించారు. దీంతో రెండు రోజుల ముందు ఆత్మహత్యాయత్నం చేసిన అతను ఇవాళ మృతి చెందాడు.