• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

భారత్‌లో ఉగ్ర కుట్ర భగ్నం చేసిన NIA

దేశంలో ఉగ్రవాదులకు డ్రోన్ శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన అంతర్జాతీయ టెర్రర్ నెట్‌వర్క్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) పట్టుకుంది. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఏడుగురు విదేశీయులను అధికారులు అరెస్ట్ చేయగా, వారిలో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు ఉన్నట్లు గుర్తించారు. వీరు భారత్‌లో డ్రోన్ల వినియోగంపై ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చినట్లు విచారణలో తేలింది.

March 19, 2026 / 09:02 AM IST

లారీని ఢీ కొన్న బైక్.. వ్యక్తి మృతి

ELR: నిలిపి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పి. గన్నవరానికి చెందిన మోతా అనంద సాత్రి పిప్పరలో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి పిప్పర నుంచి అత్తిలి వెళ్తుండగా, మార్గమధ్యంలోని జి.ఎస్.ఆర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆయన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆనంద సాత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని ఎస్ఐ ఆకుల మణికుమార్ తెలిపారు. 

March 19, 2026 / 08:59 AM IST

తల్లితో గొడవ.. ఆత్మహత్య చేసుకున్నకొడుకు

NDL: బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో తలారి వెంకటేశ్వర్లు (17) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం తల్లి ఇంటి నుంచి వెళ్లి, నెల క్రితం తిరిగి వచ్చింది. అప్పటి నుంచి తల్లితో తరచూ గొడవలు జరిగేవి. ‘నీ వల్ల గ్రామంలో మా పరువు పోయింది’ అంటూ బాధపడుతూ.. ఈ చర్యకు పాల్పడినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు. 

March 19, 2026 / 08:47 AM IST

తీవ్ర విషాదం.. గుండె పోటుతో యువరైతు మృతి

KRNL: నందవరం మండలం నది కైరవాడి గ్రామానికి చెందిన యువ రైతు వడ్రంగి రామాచారి (35) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య మల్లేశ్వరి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

March 19, 2026 / 07:40 AM IST

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

W.G: తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

March 19, 2026 / 07:11 AM IST

డోన్ రైల్వే స్టేషన్‌లో దారుణం

NDL: డోన్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్‌ఫాం చివర భాగంలో ఓ వ్యక్తి కాలు విరిగిన స్థితిలో పడివున్నట్లు ప్రయాణికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 19, 2026 / 07:08 AM IST

విషాదం.. పిడుగు పడి వ్యక్తి మృతి

KDP:  జిల్లా కాశీనాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈ క్రమంలో నారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ పెద్ద కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

March 19, 2026 / 06:47 AM IST

పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య

NDL: మండలంలోని ఎస్.లింగం దిన్నె గ్రామంలో దొర్నిపాడు హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ వర్క్ ఫ్రం హోం సంస్థ లో రూ. 3.20 లక్షలు చెల్లించి మోసపోయి దూదేకుల నాగరాజు (25)అనే రైతు కూలీ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుతెచ్చి డబ్బులు కట్టి చివరకు కంపెనీ మూతపడడంతో అప్పుల వారి బాధతాళ లేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

March 18, 2026 / 09:36 PM IST

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

AP: నంద్యాల జిల్లా నూనెపల్లెలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. భర్తను చంపి ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించారు. పోలీసు విచారణలో భార్య కుట్ర బయటపడింది. నిందితురాలు హమీద, ప్రియుడు ఇలియాస్, అతని స్నేహితుడు వీరాంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు.

March 18, 2026 / 09:01 PM IST

బాలుడు మృతి.. కుటుంబ సభ్యులకు MLA పరామర్శ

AP: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో విషాదం నెలకొంది. వర్షానికి గోడ కూలి ఏడాది బాలుడు అభి మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే జయసూర్య పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.

March 18, 2026 / 07:43 PM IST

విషాద ఘటన.. యువతి బలవన్మరణం

KRNL: పెళ్లీడుకొచ్చిన కూతురు బలన్మరణం పొందడంతో ఆ కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన యువతి ప్రమీల ఉన్నత చదువులు చదివింది. తమ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుందని భావించిన ఆశలు ఆవిరి అయ్యాయి. ప్రమీల (23) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

March 18, 2026 / 07:43 PM IST

అంబులెన్స్‌కు అడ్డొచ్చిన ఆవు.. తప్పిన ప్రమాదం

W.G: మొగల్తూరు మండలంలోని కొత్తోట వద్ద బుధవారం ఆవు అడ్డు రావడంతో ఓ ప్రైవేట్ అంబులెన్స్ దానిని ఢీకొట్టింది. తిరుపతి నుంచి కాకినాడ ఆసుపత్రికి 2 నెలల బాబును తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమై నిలిచి పోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది రాజేష్, రత్నసాగర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాబును వేరొక వాహనంలో తరలించారు. 

March 18, 2026 / 07:15 PM IST

ప్రేమ విఫలం.. యువతి ఆత్మహత్య

AP: పల్నాడు జిల్లా మాచర్లలో విషాదం నెలకొంది. ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నేళ్లుగా చౌడమ్మ, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు ప్రేమలు ఉన్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరని.. ఇంటి నుంచి వెళ్లిపోయారు. కానీ 4 రోజుల క్రితం చౌడమ్మను ఆమె తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 18, 2026 / 07:13 PM IST

అక్కను చంపిన తమ్ముడు.. ఎందుకంటే?

TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో విషాదం జరిగింది. బాటసింగారంలో అక్కను తమ్ముడు చంపి చెరువులో పడేశాడు. తర్వాత వాళ్ల అక్క కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వాళ్ల అక్క భర్త కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి అక్క చెడు తిరుగుళ్లకు అలవాటు పడిందని చంపినట్లు పోలీసులు తేల్చారు.

March 18, 2026 / 06:59 PM IST

అకాల వర్షం.. పిడుగుపాటుకు ఒకరు మృతి

AP: రాష్ట్ర రాజధాని అమరావతిలో అకాల వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ క్రమంలో తుళ్లూరులో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. కాగా ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

March 18, 2026 / 05:13 PM IST