• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

భూవివాదంలో వ్యక్తిపై కత్తితో దాడి

MDK: పొలం వివాదంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన జయరాములు అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కానికే రవి పాత గొడవలు మనసులో పెట్టుకుని పొలం వివాదంలో రాత్రి కత్తితో దాడి చేశారు. దీంతో గాయాలైన జయరాములును బంధువులు ఆసుపత్రికి తరలించారు.

April 23, 2025 / 07:10 AM IST

రెండు గడ్డివాములు దగ్ధం

W.G: ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు రైతులకు చెందిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.60,000 వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణం వెలిగించిన సిగరెట్‌ను అజాగ్రత్తగా పాడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు.

April 23, 2025 / 07:02 AM IST

తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న

NRML: మద్యం మత్తులో తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం నిర్మల్ పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు పట్టణానికి చెందిన సతీష్ తన తల్లిదండ్రులను కొడుతున్నాడని అన్న యోగేష్ నిన్న అర్ధరాత్రి కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 22, 2025 / 01:27 PM IST

సీలేరు నదిలో యువకుల మృతదేహాలు లభ్యం

ASR: చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో ఆదివారం గల్లంతయిన యువకుల మృతదేహాలు మంగళవారం లభ్యమైనట్లు చింతూరు ఎస్సై రమేష్ తెలిపారు. మృతులు చింతూరుకి చెందిన ఎస్.శ్రీను, ఎన్.దిలీప్ కుమార్‌గా గుర్తించినట్లు ఆయన చెప్పారు. స్నానం చేయడానికి దిగి ఒకరు గల్లంతు కాగా మరొకరు అతనిని రక్షించబోయి నది ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలిపారు.

April 22, 2025 / 10:32 AM IST

11.15 కిలోల గంజాయి పట్టివేత

BDK: పట్టణ శివారులో ఖమ్మం ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది 11.15 కిలోల గంజాయి, 22 లీటర్ల నాటు సారాను వేర్వేరు ఘటనల్లో పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన దాముహంటల్, బీమాగుట్ట అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నల్లబెల్లి పరిసర ప్రాంతాల నుంచి ఐదు వ్యక్తులు తరలిస్తున్న నాటు సారాను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేశారు.

April 22, 2025 / 06:54 AM IST

నీటి సంపులో దూకి వివాహిత ఆత్మహత్య

యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పుట్టపాక గ్రామంలో ఓ వివాహిత నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

April 21, 2025 / 09:27 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు – దూబచర్ల R&B రహదారి గొల్లగూడెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోపీనాథపట్నం నుండి కొయ్యలగూడెం కర్రల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం ధ్వంసం కాగా ఢీకొన్న లారీ వెనుక భాగం నాలుగు చక్రాలు ఊడిపోవడంతో లారీ రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.

April 20, 2025 / 07:40 PM IST

అశ్లీల ఫొటోలు పెడుతున్నారని ఫిర్యాదు

HYD: తన పేరుపై ఇన్‌స్టాలో నకిలీ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన కామెంట్స్‌తో పాటు, అశ్లీల ఫోటోలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను ఓ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనూ సహచర ఉద్యోగి ఇలాగే చేస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేశానని ఆమె చెప్పారు. ఇప్పుడు కూడా తనే చేసి ఉంటుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 20, 2025 / 08:25 AM IST

వాహనాలపైకి దూసుకెళ్లిన నటుడి కారు

ఎక్కడుతంగల్‌-చెన్నై ఎయిర్‌పోర్టు రోడ్డులో నటుడు బాబీ సింహా కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 6 వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాబీ సింహా కారులో లేరని పోలీసులు వెల్లడించారు.

April 19, 2025 / 02:25 PM IST

కూకట్‌పల్లిలో యువకుడి ఆత్మహత్య

HYD: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లి PS పరిధిలోని హబీబ్ నగర్‌లో జరిగింది. మహమ్మద్ చోటు 4 నెలలుగా వెన్ను నొప్పితో పాటు కుడి చేతి నొప్పితో బాధపడుతూ వైద్యం తీసుకుంటున్నాడు. అది ఎంతకీ తగ్గకపోవడంతో ఈరోజు ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 19, 2025 / 09:22 AM IST

మహిళ అదృశ్యం.. కేసు నమోదు

SRD: మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన నర్సమ్మ(55) అదృశ్యమైనట్లు ఎస్సై రాజేష్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈనెల 16వ తేదీన సదాశివపేటకు వెళ్లిన నరసమ్మ ఇప్పటివరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద విచారించగా ఆచూకీ తెలియాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.

April 18, 2025 / 07:36 PM IST

హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ దారుణహత్య

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని ఘాట్ వద్ద మృతదేహం లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న ఫరూక్‌ను గుర్తుతెలియ వ్యక్తులు దారుణహత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.మూడు రోజుల క్రితం ఫరూక్ హత్యకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 18, 2025 / 05:21 PM IST

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

ప్రకాశం: బాపట్ల పట్టణంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం లో గుర్తు తెలియని మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయాల పాలైన మహిళను బాపట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని మహిళను గుర్తించిన వారు బంధువులకు సమాచార ఇవ్వాలని ఏరియా వైద్యశాల సిబ్బంది తెలిపారు.

April 18, 2025 / 12:41 PM IST

రోడ్డు ప్రమాదంలో ఈజ్ గాం యువకుడు మృతి

ADB: దహెగాం మండలం ఈజ్ గాం గ్రామ బెంగాలీ క్యాంప్ యువకుడు రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన విశాల్ పని నిమిత్తం తన బైక్‌పై మహారాష్ట్ర వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ పడిపోవడంతో తీవ్ర గాయలై మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనతో బెంగాలీ క్యాంప్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

April 18, 2025 / 10:43 AM IST

వ్యక్తిపై హత్యాయత్నం.. కేసు నమోదు

NLR: అకారణంగా ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన రాత్రి నెల్లూరు అయ్యప్పగుడి సెంటరులో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న బక్షు ఓ దుకాణంలో ఉండగా, అదే దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. దుకాణదారుడితో బక్షు మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీ మీద పొడవడంతో బక్షు సొమ్ముసిల్లిపడిపోయాడు.

April 17, 2025 / 10:21 AM IST