AP: తూ.గో. జిల్లాలో తుపాకీ బుల్లెట్లు కలిగి ఉన్న వ్యక్తిని కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన సమీర్ హుస్సేన్ ఏడేళ్ల నుంచి దేచర్లలో నివాసం ఉంటున్నాడు. అయితే, అధికారుల సమాచారం మేరకు సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. అతని నుంచి 9MM పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్‌లో ఉపయోగించే పాయింట్ 8MM 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.