NLR: అకారణంగా ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన రాత్రి నెల్లూరు అయ్యప్పగుడి సెంటరులో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న బక్షు ఓ దుకాణంలో ఉండగా, అదే దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. దుకాణదారుడితో బక్షు మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీ మీద పొడవడంతో బక్షు సొమ్ముసిల్లిపడిపోయాడు.
NLR: ఆత్మకూరు పట్టణ చెరువులో మట్టిమాఫియా ఎక్కువవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలు, టిప్పర్ల సాయంతో రాత్రి వేళల్లో మట్టి తరలిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వాహనాల శబ్దాలతో రాత్రుల్లో తమకు ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NLR: కోవూరు మండలంలోని జాతీయ రహదారిపై సంభవించిన గాలివాన ప్రాణం తీసింది. ముంబయి నుండి ఫెడోరా రొయ్యల కంపెనీకి మేత తీసుకొచ్చిన లారీ క్లీనర్ కరణ్ మోహన్ గైక్వాడ్ (28) గాలులకు మేతపై పట్ట కప్పేందుకు లారీపైకి ఎక్కాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
కడప: పట్టణంలోని టు టౌన్ పోలీస్ స్టేషన్లో గత అర్ధరాత్రి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయి కేసులో నాకాష్ వీధికి చెందిన ఉన్న సోనూ అలియాస్ పాండు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి బాత్ రూమ్‌కు వెళ్లి షర్ట్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
MHBD: నారసింహులపేట మండలంలో ఈ రోజు ప్రమాద వశాత్తూ విద్యుత్తు షాక్‌కు గురయ్యి రెండు ఆవులు మృతిచెందాయి. యజమాని వివరాల ప్రకారం నిన్న రాత్రి వచ్చిన గాలి వాన బీభత్సానికి విద్యుత్ వైర్లు తెగి ఉండడంతో ప్రమాదవశాత్తు రైతు వీరబోయిన మల్లయ్యకు చెందిన రెండు ఆవులు కరెంటు షాక్‌కు గురయ్యి చనిపోయాయి.
HYD: కార్ఖానా PS పరిధిలో అక్కా చెల్లెళ్ల మృతి ఆలస్యంగా వెలుగు చూసింది. కార్ఖానాలోని శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో వీణ, మీనాలు నివాసం ఉంటున్నారు. వీరి ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లోనికి వెళ్లి చూడగా వారిద్దరు ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
ప్రకాశం: పొదిలికి చెందిన పూర్ణిమ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నబజారు CI వివరాల మేరకు.. ఒంగోలుకి చెందిన AR కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో ములాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈక్రమంలో పూర్ణిమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ప్రకాశం: కనిగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. మంగళవారం గ్రామానికి చెందిన యనముల పాపయ్య ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలోని రూ. 70 వేలు విలువచేసే బంగారు ఆభరణాలను దొంగిలించి తీసుకెళ్లారని బాధితుడు పాపయ్య తెలిపాడు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.
ATP: అనంతపురం నగర శివారులోని కందుకూరు వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వెంకట రాముడు అనే వ్యక్తి మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. 5 రోజుల క్రితమే వీణ(60), మీనా(59) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
KRNL: పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన ఉపాధికూలీ అడవి లక్ష్మన్న(58) సోమవారం కూలిపనిలో పాల్గొన్న సమయంలో ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురి కాగా చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ప్రాంతాల్లో శ్రమికులకు తగిన నీరు, మజ్జిగ వంటి సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ విషాదం జరిగింధన్నారు.
KRNL: వెల్దుర్తి సమీపంలోని లిమ్రాస్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం రుషిబాబు (14) మృతి చెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం తమ్ముడితో కలిసి పాలు పంపిణీకి బయలుదేరిన బాలుడు, కంటైనర్ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వారి బైక్‌ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడు విక్కీబాబు తీవ్రంగా గాయపడ్డాడు.
GDWL: మానవపాడు మండలం తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వెళ్తున్న లారీని వెనక నుండి మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. లారీ ఓనర్ కం డ్రైవర్ షేక్ హుస్సేన్ భాష (56), క్లీనర్ ఈరన్న (58) మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRCL: కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి లక్ష్మీరెడ్డి సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి కోనరావుపేట మాజీ సింగిల్ విండో ఛైర్మన్‌గా పని చేశారు. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
KNR: చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో లక్ష్మీ అనే వృద్ధురాలు తన శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. రేగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.