• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

మేడ్చల్: ఓ మహిళ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఉప్పల్ పరిధి చిలుకా నగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముద్దంగుల మహేశ్వరి(29)కి నరేశ్(40)తో వివాహం జరిగింది. వారికి 9 ఏళ్ల బాలుడు ఉన్నాడు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి సమయంలో మహేశ్వరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 29, 2024 / 07:58 PM IST

అదనపు కట్నం వేధింపులతో వివాహిత మృతి

PDPL: గోదావరిఖని బాపూజీ నగర్‌కు చెందిన వివాహిత లలిత(18) మృతి చెందింది. గత 3 మాసాల క్రితం అదే కాలనీకి చెందిన కుమారస్వామి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం నిత్యం మద్యం తాగి కుమారస్వామి అదనపు కట్నం కోసం గొడవలు పెట్టుకునేవాడు. దీంతో ఆమె ఉరివేసుకొని మృతి చెందింది. తల్లి శారద లలిత మృతిపై అనుమానంతో ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేపట్టినట్లు వన్ టౌన్ SI భూమేశ్ తెలిపారు.

December 29, 2024 / 06:30 PM IST

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం

KMM: ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పల్లెగూడెం సాగర్ కెనాల్లోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. కారులో ఉన్న డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్రేన్ సహాయంతో కారును కెనాల్ నుంచి బయటకు తీశారు.

December 29, 2024 / 06:29 PM IST

రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆదివారం ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. అక్కడున్న స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్నా రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

December 29, 2024 / 06:24 PM IST

విషాదం: బోరుబావిలో పడిన బాలుడి మృతి

మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గుణ జిల్లాలో సుమిత్ మీనా అనే బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. అది గమనించిన కుటుంబసభ్యులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు 16 గంటలు శ్రమించి బాలుడిని కాపాడారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

December 29, 2024 / 05:58 PM IST

రాయగిరి వద్ద రోడ్డు ప్రమాదం

BHNG: భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి రిలయన్స్ పెట్రోలు పంపు ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు వెళ్తున్న కార్లు మూడు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. కార్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 29, 2024 / 03:25 PM IST

రైతుకు పాము కాటు.. తీవ్ర అస్వస్థత

CTR: పుంగనూరు మండలం, చండ్రమాకులపల్లికి చెందిన రైతు కందిరీగల శంకర్(60) ఊరికి సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు పాడి ఆవులను మేతకు తోలుకొని వెళ్ళాడు. అక్కడ చెట్ల పొదల్లో ఉన్న విష సర్పం కాలిపై కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పాము కరిచిందని ఫోన్‌ ద్వారా కుటుంబీకులకు చెప్పడంతో వారు వచ్చి బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

December 29, 2024 / 03:20 PM IST

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

MLG: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంగపేట మండలం కోమటిపల్లిలో ఆదివారం వరి చేనులో విద్యుత్ షాక్‌తో జవ్వాజి రామకృష్ణ (30) మృతి చెందారు. పంట పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామకృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

December 29, 2024 / 03:00 PM IST

వెంకటాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వివరాలివే.!

KDP: కొండాపురం మండలం వెంకటాపురం గ్రామం వద్ద కారు-స్కూటర్ ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారుకొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి చెందిన అశోక్ (18), అనంతపురం జిల్లా సూరేపల్లి గ్రామానికి చెందిన రాము(33), ప్రణయ్(10)గా స్థానికులు తెలిపారు. వీరిలో అశోక్‌కు కాలు, చేయి విరిగింది. ప్రణయ్, రాములకి కాలు విరిగి గాయాలైనట్లు సమాచారం.

December 29, 2024 / 01:21 PM IST

రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయలు

KDP: కొండాపురం మండలం వెంకటాపురం గ్రామం వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు తాడిపత్రి నుంచి కొండాపురం వైపు వస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటర్‌లో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులకు కాళ్లు విరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

December 29, 2024 / 12:57 PM IST

‘రోడ్డు ప్రమాదం…. మహిళ మృతి’

ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరు ఫ్లై ఓవర్ దగ్గర ఆదివారం ఉదయం టంగుటూరు నుండి వస్తున్న ఆటోను వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది‌. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న టంగుటూరుకి చెందిన లక్కే పద్మ మరణించింది. ఇద్దరికీ గాయాలయ్యయి. వీరు బొంతలు కుట్టటానికి ఒంగోలు వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

December 29, 2024 / 12:12 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

NLR: కోవూరు మండలం పెద్దపడుగుపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోవూరు జంగం వీధికి చెందిన సాయి పల్సర్ బైకుపై వేగంగా వెళుతూ.. డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

December 29, 2024 / 11:39 AM IST

అప్పుల బాధతో వ్యక్తి మృతి

BDK: అప్పుల బాధతో వ్యక్తి మృతి చెందిన ఘటన కొత్తగూడెంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. రామవరం ఏరియా ఎస్సీబీ నగర్‌కు చెందిన భూక్యా రవి సుతారి మేస్త్రిగా పని చేస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావటంతో వాటిని తీర్చే దారిలేక ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రవి మృతితో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది.

December 29, 2024 / 11:10 AM IST

విమాన ప్రమాదానికి కారణమిదే..!

దక్షిణ కొరియాలోని ముయాన్ విమానాశ్రయంలో విమానం గోడకు గుద్దుకోవడంతో 179 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. విమానం నేలపైకి దిగిన తర్వాత రన్ వే చివరికి వచ్చే సమయంలో వేగాన్ని నియత్రించుకోవడంలో విఫలమైనట్లు అధికారులు చెప్పారు. విమానం గోడను ఢీకొట్టడంతో అందులోని ఫ్యూయల్ మంది మంటలు వ్యాపించాయి.

December 29, 2024 / 10:45 AM IST

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ASR: ముంచంగిపుట్టు మండలంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిస్సా రాష్ట్రంలోని జొడహం పంచాయతీ పరిధి కొట్ని పొదురుకి చెందిన జలంధర్ ముంచంగిపుట్టు వైపు నుంచి తమ స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని దూళిపుట్ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో జలంధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

December 29, 2024 / 10:32 AM IST