KMM: ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పల్లెగూడెం సాగర్ కెనాల్లోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. కారులో ఉన్న డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్రేన్ సహాయంతో కారును కెనాల్ నుంచి బయటకు తీశారు.