AP: AIS అధికారులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఇచ్చే వాటాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చే వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచింది. డిప్యుటేషన్‌పై ఉన్నవారికీ వర్తింపజేస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటా పెంపును 2019 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.