NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈరోజు కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిండి ప్రాజెక్టుపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ ద్వారా ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించాలని సూచించారు.