CTR: చౌడేపల్లె మండలం అంకుతోటపల్లికి చెందిన చిన్న రెడ్డప్పపై మార్చి 30న కుమారుడు మనోహర్ రెడ్డి, కోడలు సరస్వతమ్మ కలిసి దాడి చేశారు. గాయాలతో చికిత్స పొందిన రెడ్డప్ప ఏప్రిల్ 21న మృతిచెందాడు. ఈ కేసులో మనోహర్‌ను ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. కోడలు సరస్వతమ్మను మంగళవారం అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆమెను జైలుకు తరలించారు.