GDWL: మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డి గ్రామంలో నూతన వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకై నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ను మంగళవారం గ్రామస్తులు ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించి ₹10,000 రూపాయలు విరాళం అందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ ఆలయాలకు నిర్మాణానికి నా వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.