NZB: ఈత వనాలు పెంచి గౌడన్నల ఆదాయాన్ని పెంచుతామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మంగళవారం అన్నారు. మోపాల్ మండలం తానకుర్ధులో వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈత మొక్కలను నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం గౌడ కులస్థుల ఆదాయాన్ని పెంచేలా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.