CTR: పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష ఉన్న యువ పారిశ్రామికవేత్తలకు కడా ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన వాటిపై చర్చించారు. కుప్పం ప్రాంత యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు అవసరమైన శిక్షణతో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్యాంకు లోన్, మార్కెటింగ్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.