ప్రకాశం: కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులకు ఫామ్-6, ఫామ్-6ఏ, ఫామ్-6బి, ఫామ్-7, ఫామ్-8 లపై శిక్షణ ఇచ్చారు బి ఎల్ వోలకు ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ ఇచ్చి, అనంతరం వారికీ ఆన్లైన్ పరీక్షను నిర్వహించారు.