NGKL: కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో మంగళవారం జనసేన కార్యకర్తలకు సభ్యత్వ ఇన్సూరెన్స్ కిట్లను నాయకులు పంపిణీ చేశారు. పార్టీ సభ్యత్వం చేసుకున్న ప్రతి జనసేన కార్యకర్తకు ఈ ఇన్సూరెన్స్ కిట్లు ఆపదలో ఆదుకుంటాయని వారు తెలిపారు. జనసేన అందరికీ అందుబాటులో ఉంటుందని వారన్నారు. కార్యక్రమంలో రవి యాదవ్, సాయి, మున్నా, సాయి తదితరులు పాల్గొన్నారు.