NLG: నల్గొండ సీపీఐ జిల్లా కార్యదర్శిగా నెల్లికంటి సత్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరకొండలో జరిగిన జిల్లా 23వ మహాసభలో ఆయనను మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. సహాయ కార్యదర్శులుగా పల్లా దేవేందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ నియమితులయ్యారని CPI కార్యవర్గాలు తెలిపాయి.