MBNR: జిల్లాలోని రవీంద్రనగర్‌లో కొలువైన శీతలాదేవి పోచమ్మ అమ్మ వారికి బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.