‘హరిహర వీరమల్లు’ మూవీ ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత AM రత్నం ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఈ మూవీ కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేసి షూట్ చేశాం. హార్బర్ సెట్ ఎంతో సహజంగా ఉంటుంది. 17వ శతాబ్దంలో ఓడరేవులు ఎలా ఉండేవో అలాగే రూపొందించాం. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు నాటి కాలానికి వెళ్లిన అనుభూతి పొందుతాడు’ అని చెప్పాడు.