ELR: ఏలూరు ఇరిగేషన్ డేటా కార్యాలయంలో ఇంజినీరు కేఎల్ రావు 123వ జయంతి మంగళవారం జరిగింది. ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కేఎల్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి కావడానికి కేఎల్ రావు కృషి వెలకట్టలేనిదన్నారు. నెహ్రూ మంత్రివర్గంలో కేఎల్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు.