GNTR: గుంటూరు నగరంలోని అరండల్పేట, పట్టాభిపురం, నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కళాశాలల వద్ద మంగళవారం పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ అరవింద్ మాట్లాడుతూ.. ఎవరైనా ఈవిటీజింగ్కు పాల్పడినా, అల్లర్లు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.