CTR: ప్రముఖ ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్ గురువు చిత్తూరులోని బీవీ రెడ్డి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాసానికి వచ్చారు. శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ గురువును ఎమ్మెల్యే శాలువ, పూలమాలతో సత్కరించారు. ఆయన ఎమ్మెల్యేకు భగవద్గీత పుస్తకాన్ని బహూకరించారు.