ELR: ఐసీడీఎస్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సుజాతరాణి మంగళవారం ఉంగుటూరులోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రాల్లో ఫేస్ యాప్ ద్వారా రేషన్ పంపిణీ, పూర్వ ప్రాథమిక విద్యను పరిశీలించారు. పిల్లల్లో బరువు, ఎత్తు తగ్గకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చారు. ఆమె వెంట ఆర్జేడీ కార్యాలయం నోడల్ అధికారి స్వరాజ్యలక్ష్మి ఉన్నారు