TG: దేశంలో 33% వ్యాక్సిన్లు జీనోమ్ వ్యాలీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ‘కొవిడ్ మహమ్మారి సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారుచేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేశాం. దాదాపు 100 దేశాలకు వ్యాక్సిన్లు అందించిన గొప్పతనం జీనోమ్ పరిశ్రమలదే. ఇక్కడి పరిశ్రమలు రాష్ట్రానికే గుర్తింపుని తీసుకొచ్చాయి. పరిశ్రమల విధానాల్లో గతంలో బాగున్న వాటిని మార్చలేదు’ అని తెలిపారు.