KRNL: మంత్రాలయంలో పీఠాధిపతి సుభదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ‘జయతీర్థుల ఆరాధన’ను వైభవంగా నిర్వహించారు. మంగళవారం జయతీర్థుల ఆరాధన సందర్భంగా రాఘవేంద్ర స్వామి మఠంలో జయతీర్థుల చిత్రపటాన్ని బంగారు రథంపై ఉంచి పీఠాధిపతి ప్రత్యేక పూజలు జరిపారు. మంగళహారతులు ఇచ్చి బంగారు రథోత్సవాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా ఊరేగించారు.