VZM: రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. పాగిరి గ్రామంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏడాది పాలనలో చేసిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించి కరపత్రాలను అందించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.