ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ ను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ తనయుడు, ప్రస్తుతం జార్ఖండ్ CM హేమంత్ సోరెన్ తో ఆయన భేటీ అయ్యారు. శిబు సోరెన్ ఆరోగ్య పరిస్థితి గురించి CMను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తన ‘X’ ఖాతాలో పేర్కొన్నారు.