NLR: తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ అంగన్వాడీ కేంద్రాన్ని ఇవాళ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని పలు రికార్డులను రిజిస్టర్లను తనిఖీ చేశారు. పిల్లలకు అందజేసే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అన్ని సరుకులు పరిశీలించి సరుకుల నాణ్యత బాగున్నాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.