దివంగత నటి బి.సరోజా దేవి నేత్రదానం చేశారు. ఐదేళ్ల క్రితం నేత్రదానం చేసేందుకు తన పేరును నమోదు చేసుకున్నారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో ఇటీవల సరోజా దేవి చనిపోయారు. అయితే ఆమె రెండు కార్నియాల పనితీరు బాగుందని, అవసరమైన వారికి త్వరలోనే వాటిని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తామని నారాయణ నేత్రాలయ వైద్యులు వెల్లడించారు.