PDPL: గోదావరిఖని బాపూజీ నగర్‌కు చెందిన వివాహిత లలిత(18) మృతి చెందింది. గత 3 మాసాల క్రితం అదే కాలనీకి చెందిన కుమారస్వామి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం నిత్యం మద్యం తాగి కుమారస్వామి అదనపు కట్నం కోసం గొడవలు పెట్టుకునేవాడు. దీంతో ఆమె ఉరివేసుకొని మృతి చెందింది. తల్లి శారద లలిత మృతిపై అనుమానంతో ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేపట్టినట్లు వన్ టౌన్ SI భూమేశ్ తెలిపారు.