E.G: నిడదవోలు మండలం డి.ముప్పవరంలో ఆదివారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భార్యభర్తల మధ్య గొడవతో మనస్థాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. తల్లిచనిపోయిందని తెలియని ఆ చిన్నారులు అమ్మకావాలని అంటుడటం అక్కడివారి కంట కన్నీరు తెప్పించింది. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
WGL: ట్రాక్టర్‌పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన వర్ధన్నపేట పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భవానికుంటతండాకు చెందిన రైతు నూనవత్. సోమల్లు తన వ్యవసాయ పొలం నుంచి తండాకు వెళ్లేందుకు ట్రాక్టర్ ఎక్కాడు. బానెట్ పై కూర్చున్నాడు. అదుపు తప్పి ట్రాక్టర్ కింద పడగ సోమల్లు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందడు.
VSP: సబ్బవరం PS పరిధిలోని అమ్ములపాలెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడ్డారు. బలిజపాలెంకు చెందిన సూర్యారావు(48), భార్య మంగమ్మ ఆదివారం సబ్బవరం వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు బైక్‌పై స్వగ్రామం బయలుదేరారు. అమ్ములపాలెం వద్ద వెనుక వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యారావు చనిపోయారు.
కృష్ణా: విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కృష్ణలంక పోలీసుల వివరాల మేరకు.. బందరు కాలువలో వీఎంసీ గేట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పరిశీలించామన్నారు. ఈ క్రమంలో అతని వయసు 40 నుంచి 45 సంవత్సరం మధ్య వయసు ఉంటుందన్నారు. మృతుడు 5 అడుగులు ఉన్నాడని, గోధుమ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలం దద్దవాడ జాతీయ రహదారిపై ఆదివారం ఆటోను తప్పించే క్రమంలో కారు ఆటోను ఢీ కొట్టి మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కారు వాహనాలను తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ పాత ఇంటిని ఢీ కొట్టింది.
VSP: రాంబిల్లి మండలం గోవిందపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గల జీడి తోటల్లో ఆదివారం పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై నాగేంద్ర తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సోమవారం వీరిని కోర్టుకు తరలిస్తామని అన్నారు.
VZM: గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ ప్రకాశ్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసినదే. నిందితున్ని పోలీసులు సాలూరు కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమైండ్ విధించడంతో బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని రాళ్ళపాడులో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. వారిని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఓ స్థలం వివాదం విషయంలో తమపై కర్రలు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని గ్రామానికి చెందిన గోగుల మాల్యాద్రి తెలిపారు.
VZM: నూర్పిడి యంత్రం బోల్తాపడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మహారాణి తోట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పొలాలకు నూర్పిడి యంత్రంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అది బోల్తా పడిందని సమాచారం. స్థానికులు పోలీసులకు తెలియపరిచారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: బి. కొత్తకోట పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటున్న దంపతులు నూరుల్లా, షాహినల కుమారుడు మహమ్మద్ అయాన్(8) స్థానికంగా 2వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో తల్లిదండ్రులతో కలిసి బెంగళూరు రోడ్డులోని నూనె గింజల ఫ్యాక్టరీకి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ నూనెతీసే యంత్రంలో ప్రమాదవశాత్తు చేయి పడి రెండుగా తెగిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.
CTR: మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కారు టైర్ పంచర్ కావడంతో బైక్, బంకు, చెట్టును ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు.
GNTR: సోషల్ మీడియాను మంచికి వాడుదాం అంటూ తాడేపల్లిలో భారీ హోర్డింగ్ వెలసింది. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్ సోషల్ మీడియాపై క్యాంపెయిన్ త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగుల ఏర్పాటు చేశారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
వరంగల్: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన కంపెల్లి సంజన(13)బాలిక మతిస్థిమితం లేక ఈనెల7వ తేదీన పురుగు మందు తాగింది. వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం బాలిక మృతి చెందింది.పోలీసులు కేసు నమోదు చేశారు.
కోనసీమ: అయినవిల్లి మండలం మాగాంకు చెందిన నక్కా సోమశేఖర్ (32) ఆదివారం బైక్‌పై వెళుతుండగా ముమ్మిడివరం మండలం అనాతవరం వాటర్ ప్లాంట్ వద్ద వెనక నుంచి ట్రక్ ఆటో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని అమలాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై ముమ్మిడివరం ఎస్‌ఐ జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చిరాగ్‌పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజేందర్ రెడ్డి వివరాలు.. బుచినేల్లీ గ్రామా శివారులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 35 ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 8712656766 సమాచారం ఇవ్వాలన్నారు.