CTR: మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కారు టైర్ పంచర్ కావడంతో బైక్, బంకు, చెట్టును ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు.