ADB: పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి జోగు రామన్న శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూభారతి చట్టం పేరుతో జిల్లాలో మంత్రుల పర్యటనతో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రైతు రుణమాఫీ, రైతుబంధు అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈనెల 27న వరంగల్ పట్టణంలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభ విజయవంతం చేయాలని కోరారు.