ELR: రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ ఏడీ బి. నాగకుమార్ తెలిపారు. చింతలపూడి సబ్ డివిజన్లో 3,152 క్వింటాళ్లు వచ్చిన విత్తనాలు రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. జీలుగ, పిల్లి పెసర విత్తనాలు ఎకరానికి 16 కిలోలు, జనుము విత్తనాలు ఎకరానికి 20 కిలోల చొప్పున రైతులు చల్లుకోవాలని సూచించారు.