టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాడు. భారత జట్టుకు కోహ్లీ అవసరం ఇప్పుడు చాలా ఉందన్నాడు. కోహ్లీ బరిలోకి లేకుంటే టెస్టు క్రికెట్ స్వరూపమే మారిపోతుందని అన్నాడు.