ATP: గుత్తిలో రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలకు గత రెండు రోజులుగా ఆకతాయిల వరుసగా నిప్పు పెడుతున్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం గుత్తి సీఐ రామారావుకు వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.