ATP: అంబికా ఫౌండేషన్, విజేత హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 19న గుంతకల్లులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి వైద్యులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు చేస్తారు. ఎంపికైన వారికి ఉచిత ఆపరేషన్లు, కంటి అద్దాలు, భోజన వసతి కల్పిస్తామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు.