ELR: విజయవాడకు చెందిన రమాదేవి తిరుపతిలో రైలు ఎక్కి విజయవాడకు చేరుకున్నారు. రైలులోనే తన బ్యాగును మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. బ్యాగ్ కనిపించకపోవడంతో విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరులో ఆ బ్యాగును, అందులో ఉన్న రూ.17 లక్షల బంగారు ఆభరణాలను ఏలూరు రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని ఈరోజు రమాదేవికి అందజేశారు.