KKD: కాకినాడ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజాసమస్యల పరిష్కార కార్యక్రమం (PGRS) జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆదేశించారు.