W.G: నిడదవోలు పట్టణంలో ఇటీవలే హత్యకు గురైన బాషా కుటుంబ సభ్యులను పరామర్శించటానికి శనివారం మంత్రి కందుల దుర్గేష్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.