HYD: తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ మారేడుపల్లిలో టులెట్ బోర్డు చూసి ఓ వృద్దురాలి ఇంట్లోకి వచ్చిన దొంగ ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. వృద్ధురాలి మెడలో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లాడు. వృద్ధురాలు అరుస్తూ బయటికి వచ్చే లోపు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.